FbTelugu

బ్రోకర్ సుభానీ రూ.100 కోట్లకు టోపీ

నారాయణపేట: నారాయణపేటలో ఒక స్టాక్ బ్రోకర్ షేర్ మార్కెట్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. షేక్ సుభానీ రాత్రికి రాత్రే షాపు ఇల్లు ఖాళీ చేసి పరారీ అయ్యాడు.
రూ.1 లక్షకు నెలకు రూ.20 వేలు ఇస్తాను అంటూ ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించాడు.

సుభానీ ని నమ్మి మధ్య తరగతి ప్రజలు, చిన్న చిన్న వ్యాపారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. కొందరికి మాట ప్రకారం డబ్బులు ఇవ్వడంతో మిగతావారికి నమ్మకం కుదిరింది. అసలుతో పాటు అత్యధిక వడ్డీ మొత్తం ఇవ్వడంతో లోటు ఏర్పడింది. ఈ మొత్తాన్ని భర్తీ చేయలేక సుభానీ సుమారు రూ.100 కోట్లకు టోపీ వేసి పరారీ అయ్యాడు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.