FbTelugu

ఇండియాకు బలగాలను పంపిస్తాం: ఫ్రాన్స్

పారిస్: భారత్ కు అవసరమైతే తమ సాయుధ బలగాలను తరలించడంతో పాటు ఎలాంటి సాయమైనా చేసేందుకు ముందుంటామని ఫ్రాన్స్ ప్రకటించింది.

చైనా దేశం నుంచి భారత్ కు ముప్పు ముంచుకువస్తున్న తరుణంలో ఫ్రాన్స్ బాసటగా నిలిచింది. గల్వాన్ లోయలో ఈ నెల 15న జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించడంపై ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పంపిన లేఖ లో సంతాపం వ్యక్తం చేసింది.

రెండు దేశాల ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో స్నేహపూర్వక హస్తం అందిస్తున్నట్లు ఆమె ప్రకటించింది. దక్షిణాసియా ప్రాంతంలో భారత్ తమ వ్యూహాత్మక భాగస్వామి ఆని ఆమె కొనియాడారు. ఈ విషయంలో రాజ్ నాథ్ సింగ్ కలిసి చర్చలు జరిపేందుకు తాము సిద్దమని ఫ్లోరెన్స్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.