FbTelugu

నాలుగో ప్రపంచ కుబేరుడు… ముకేశ్ అంబానీ!

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరో మెట్టు పైకి ఎక్కారు. బ్లమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీ నాలుగో స్థానం చేరుకున్నారు.

ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త బెర్నార్డ్ అర్నాల్డ్ ను వెనక్కి నాలుగో స్థానానికి ఎగబాకారు. ప్రపంచ కుబెరులుగా పేరొందిన ఎలాన్ మాస్క్, సెర్జె బ్రిన్, ల్యారీ ఫేజ్, వారెన్ బఫెట్ లాంటి వారిని కూడా దాటేశారు. బ్లూబ్ బర్గ్ బిలియనీర్స్ జాబితాలో తొలి స్థానంలో అమెజాన్ అధిపతి జెఫ్ జోజెస్, రెండో స్థానంలో మెక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మూడో స్థానంలో ఫేస్ బుక్ అధిపతి మార్క్ జూకర్ బర్గ్ కొనసాగుతున్నారు. నాలుగో స్థానంలోకి ముకేశ్ చేరుకున్నారు. దీంతో అర్నాల్డ్ ఐదవ స్థానానికి వెళ్లిపోయారు.

You might also like