FbTelugu

నలుగురు ఉగ్రవాదులు అరెస్టు

జమ్ముకశ్మీర్: నలుగురు ఉగ్రవాదులు పోలీసు బలగాలకు పట్టుబడడంతో అరెస్టు చేసిన ఘటన జమ్ము కశ్మీర్ లోని షోపియన్ జిల్లా, మాల్ దేరాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బారాముల్లా కాల్పుల అనంతరం భారత బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ గాలింపులో నలుగురు ఉగ్రవాదులు పట్టుబడడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారు ఈ మధ్యే ఉగ్రవాద శిబిరాల్లో కొత్తగా చేరినట్టు గుర్తించారు. నిన్నటి ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు, ఓ పోలీసు మృతి చెందగా.. ఇద్దరు ఉగ్రవాదులు హతమైనారు.

You might also like