FbTelugu

నలుగురు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు సస్పెండ్: సీపీ

Four-SI-and-two-ASI-are-suspended

హైదరాబాద్: అక్రమంగా హుక్కా సెంటర్లు నడుపుతున్న వారికి సహకరించి విధుల్లో లంచాలు వసూలు చేసిన నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లను, ఇద్దరు ఏఎస్సై లను సస్పెండ్ చేసినట్టు నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వివరాల్లోకెళితే.. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ లో పనిచేసిన ఎస్సైలు కురు మూర్తి, డి శ్రీను, ప్రస్తుతం పనిచేస్తున్న ఈ.శంకర్, రామకృష్ణ, ఏఎస్సైలు మహమ్మద్ జాఫర్, శామ్యూల్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. రాత్రి విధుల్లో ఉన్నపుడు అక్రమంగా నడుపుతున్న హుక్కా సెంటర్ల వద్ద నిర్వాహకులు నుంచి యువకుల నుంచి మామూళ్లు తీసుకున్నట్లు సీపీకి సమాచారం అందడంతో.. దర్యాప్తు చేసిన కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

You might also like