FbTelugu

రెచ్చిపోయిన రౌడీ మూకలు.. నలుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: నగరంలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. రౌడీ మూకల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలైనాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆసిఫ్ నగర్ లో కొందరు రౌడీ మూకలు రెచ్చిపోయి ఓ ఫర్నీచర్ షాప్ లో చొరబడి మారణ ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like