FbTelugu

ఎడాపెడా అప్పులపై కేంద్రం ఆగ్రహం

అమరావతి: రాష్ట్రాలలో అధికారం కోసం ప్రాంతీయ పార్టీలు ఇష్టారీతిన హామీలు ఇస్తూ ప్రజాధనాన్ని పప్పుబెల్లాల మాదిరి ఖర్చు చేస్తున్నారు. అభివృద్ధి, పారిశ్రామిక విస్తరణను వదిలేసి సంక్షేమ పథకాలకు నిధులను మళ్లిస్తున్నారు.

ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలలో అభివృద్ధి కుంటుపడుతున్నదని కేంద్రం గ్రహించింది. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడంపై ఆగ్రహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏపీ కి నాలుగు పేజీల లేఖ పంపించింది. రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఎడాపెడా రుణాలు తీసుకుని ఖర్చు చేయడానికీ కుదరదని తేల్చి చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నికర రుణ పరిమితి ఎంతో కేంద్రం నిర్దేశించిందని వెల్లడించింది. ఆ రుణ పరిమితిని ఎట్టిపరిస్థితుల్లో దాటకూటదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖ నాలుగు పేజీల లేఖను పంపించింది. ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. నిధుల లేమి కారణంగా ఈ నెల ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు చెల్లించిన విషయం తెలిసిందే. దీనికి కూడా అప్పులు తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.