FbTelugu

ఏపిలో నలుగురు ఎమ్మెల్సీ ప్రమాణం

అమరావతి: వైసిపి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, మోషెన్ రాజ్ ల చేత మండలి ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు.
సోమవారం మండలి ఛైర్మన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీరంగనాథ్, అనిల్ యాదవ్, తానేటి వనిత, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

గవర్నర్ కోటా కింద లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, మోషెన్ రాజ్ ను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ సిఎం వైఎస్.జగన్ ఏపి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు పంపించారు. నలుగురు పేర్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ ఆమోదం లభించడంతో ఇవాళ మండలి ప్రొటెం ఛైర్మన్ వారిచేత ప్రమాణం చేయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.