FbTelugu

హైదరాబాద్ లో ఒక్క రోజే నలుగురి హత్య

హైదరాబాద్: రాజధాని నగరం హత్యలతో అట్టుడుకుతున్నది. గంటల వ్యవధిలో నలుగురిని హత్య చేశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారుతున్నాయి.

మెహిదీపట్నం నానల్ నగర్ ఆలివ్ ఆసుపత్రి సమీపంలో నడి రోడ్డుపై రౌడీ మూకలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నాయి. రౌడీ షీటర్లు చాంద్ మహ్మద్, మహ్మద్ అబూలను దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి చంపారు. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఘటనా స్థలానికి లంగర్ హౌస్ పోలీసులు, క్లూస్ టీమ్ లు చేరుకున్నాయి. ఆధిపత్య పోరు కారణంగానే ఒకరిపై మరొకరు దాడిచేసుకుని హత్యలు చేశారని పోలీసులు భావిస్తున్నారు.

అంతకు ముందు గోల్కొండ, రెయిన్ బజార్ ప్రాంతంలో కూడా హత్యలు జరిగాయి. గోల్కొండ పరిధిలో రాహుల్ ను స్నేహితుడే నరికి చంపాడు. రెయిన్ బజార్ లో కూడా యువకుడుని రాంబో డాగర్ తో సినిమా స్టైల్ లో పొడిచి చంపారు. షోర్మా హోటల్ సమీపంలలో మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (20) యువకుడిని నడిరోడ్డుపై పొడవైన కత్తితో పొడిచి చంపగా, రక్తమడుగులో కొట్టుకుని ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలిసిన వెంటనే రెయిన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఇమ్రాన్ మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. వరుసకు సోదరులైన తాలిబ్, మెహతాబ్ తో పాటు మరో ఇద్దరు మర్డర్ లో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

You might also like