FbTelugu

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

గుంటూరు: ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో.. కారులోని నలుగురు మృతి చెందిన ఘటన జిల్లాలోని నార్కట్‌పల్లి-మేదరమెట్ల రహదారిపై తంగేడుమల్లి దగ్గర చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో వెళుతుండగా.. ప్రమాదవ శాత్తూ తంగేడుమల్లి మేజర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.