FbTelugu

శానిటైజర్ తాగి నలుగురు మృతి

తిరుపతి: చేతులు శుభ్రం చేసుకునేందుకు వినియోగిస్తున్న శానిటైజర్ ను మత్తు కోసం  సేవించి నలుగురు మృతి చెందారు. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నది.

తిరుపతి మునిసిపాలిటీ లో విధులు నిర్వహిస్తున్న వీరయ్య(50), స్కావెంజర్స్ కాలనీకి చెందిన మరో వ్యక్తి కుమారస్వామి (30) గా గుర్తించారు. వీరితో పాటు వెంకటరత్నం,మరొకరు మృతి చెందారు. మద్యం వ్యసనానికి బానిస అయిన నలుగురు నేడు శానిటైజర్ తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. వైద్యం కోసం రుయా ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ఇరువురు మృతి చెందారు. వీరయ్య భార్య భారతి, కుమారస్వామి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. ఈస్ట్ ఎస్ఐ ఎస్.జయచంద్ర కేసు నమోదు చేసి  విచారిస్తున్నారు.

You might also like