FbTelugu

రెండు మామిడి చెట్లకు నలుగురు కాపలా!

భోపాల్: సాధారణంగా ఒక తోట లేదా భవనానికి కాపలాదారులను పెట్టడం చూస్తున్నాం. కాని ఇక్కడ రెండే రెండు మామిడి చెట్లకు నలుగురు కాపలదారులు, ఆరు శునకాలను పెట్టారు.

జబల్ పూర్ కు చెందిన రాణి, సంకల్ప్ పరిహార్ దంపతులకు శివారు ప్రాంతంలో ఒక తోట ఉంది. అందులో రెండు అరుదైన మామిడి చెట్లు ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వీటిని నిత్యం చూసేందుకు నలుగురు కాపలా కాయడంతో ఆరు కుక్కలు రక్షణగా ఉంటాయి. ఎవరైనా తెలియని వారు ఆ చెట్ల వద్దకు వస్తే అరుస్తుంటాయి. ఎందుకంటే అవి మామూలు చెట్లు కాదు. కల్పవృక్షాలు మరి. ఈ రెండు చెట్లు మియాజాకి జాతికి చెందినవి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒక కిలో మామిడికి రూ.2.70 లక్షలు గతేడాది పలికాయి. ఈ విషయం తెలిసిన కొందరు ఎత్తుకెళ్లడంతో కాపలాదారులను నియమించుకున్నారు. చెన్నై నగరానికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి రైళ్లో వీరికి మామిడి మొక్కలు ఇచ్చాడు. అవి మియామి జాతికి చెందిన చెట్లు అనే విషయం తెలియదని, సాధారణంగా సాగు చేశామన్నారు. పెరిగి పెద్దగా అయిన తరువాత జపాన్ దేశపు మియామి జాతి చెట్లు అని హార్టికల్చర్ అధికారులు తెలిపారని సంకల్ప్ పరిహార్ తెలిపారు. మరిన్ని సాగు చేసేందుకు వీటిని జాగ్రత్తగా చూసుకుంటున్నామని ఆయన వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.