FbTelugu

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని…

రాజమహేంద్రవరం: భర్త రెండో వివాహం చేసుకున్నాడని తీవ్ర మనస్థాపానికి గురైన ఒక మహిళ తన ఇద్దరు పిల్లలు, తల్లితో సహా ఉరేసుకుని బలవన్మరణం చెందింది.

ఈ ఘటన రాజమహేంద్రవరం అంబేద్కర్ నగర్ రామాలయం వీధిలో చోటు చేసుకున్నది. విజయవాడకు చెందిన నాగేంద్ర కుమార్ తో శివపావనికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. నాగేంద్ర కుమార్ ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు. ఇది నచ్చని భార్య భూపతి శివపావని (27) తన కుమారుడు నిషాన్ (9), రితికా (7), తల్లి సంగిశెట్టి కృష్ణవేణి మూకుమ్మడిగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి నగరవాసులు ఉలిక్కిపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.