FbTelugu

ప్రైవేటు చేతుల్లోకి నాలుగు బ్యాంకులు

ముంబై: దేశంలో ఇప్పటి వరకు ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వం పరం కాగా ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
బ్యాంక్ ఆప్ ఇండియా, బ్యాంక్ ఆప్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ప్రైవేటీకరణ చేయనున్నారు. ఉద్యోగుల సంఖ్యాపరంగా చూస్తే చా తక్కువ సంఖ్యలో ఉండడంతో తొలుత బ్యాంక్ మాహారాష్ట్ర తోనే కార్యాచరణ మొదలుపెట్టనున్నారు. ఐఓబీ బ్యాంకు ఈ మధ్యకాలంలో పారిశ్రామికవేత్తల అప్పుల ఎగవేత కారణంగా నష్టాలను చవి చూసింది. ఈ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా ఆంక్షలు విధించింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడంతో వాటాలను విక్రయించనున్నారు.

అయితే ఈ నిర్ణయాన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నష్టాల పేరుతో బ్యాంకులను వదిలించుకుని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.