కాబూల్: ఓ పోలీసు అధికారి అంత్యక్రియల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో అనేక మంది మృత్యువాత పడిన ఘటన ఆఫ్ఘనిస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఆఫ్ఘనిస్థాన్ లోని నంగర్హార్ ప్రావిన్స్‌లో ఇవాళ ఓ పోలీసు అధికారి అంత్యక్రియలు జరుగుతుండగా ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది.
అయితే ఈ బాంబు పేలుడు ఆత్మాహుతి దాడేనని, ఈ దాడిలో సుమారు నలబై మందికి పైనే మృతి చెంది ఉంటారని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిపారు. ఇది ఐఎస్ ఉగ్రమూకల పనేనని అక్కడి అధికారులు అనుమానిస్తున్నట్టు తెలిపారు.