FbTelugu

కరోని పుట్టింది అక్కడే… నేను చెప్పింది కరెక్టు: ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్ చైనా దేశంలోని వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని, అది అక్కడే పుట్టిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వైరస్ పుట్టుకపై తాను చెప్పిందే నిజమైందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ప్రతి ఒక్కరు చైనా వైపే చూస్తున్నారని, తనను శత్రువుగా భావించేవాళ్లు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పింది నిజమనిఅంటున్నారన్నారు.

వైరస్ ను పుట్టించిన చైనా ప్రపంచ దేశాలకు 10 లక్షల కోట్ల డాలర్లు పరిహారం ఇవ్వాలని ట్రంప్ సూచించారు. అమెరికా వైరస్ సలహాదారు డాక్టర్ ఆంటోని పౌచి ప్రైవేటు ఈ మెయిల్స్ మీడియాకు విడుదల చేయడంతో చైనా వూహాన్ ల్యాబ్ పై మళ్లి చర్చ మొదలైంది. మూడు వేల పేజీలకు పైగా ఉన్న ఈ మెయిల్స్ ను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు వాషింగ్టన్ పోస్టు, బజ్ ఫీడ్, సిఎన్ఎన్ లు ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్టు కింద పొందాయి. గతేడాది జనవరి నుంచి జూన్ మధ్య అనగా కరోనా ఫస్ట్ వేవ్ లోఈ మెయిల్స్ పరస్పరం పంపించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.