FbTelugu

బీజేపీలోకి సర్వే సత్యనారాయణ

హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొద్ది కాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

సోనియా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నా రాష్ట్ర నాయకత్వం అణగదొక్కే ప్రయత్నం చేయడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. గతేడాది జనవరిలో మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సర్వే సత్యనారాయణ పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ ఆర్సీ.కుంతియా పై విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే కొద్ది రోజులుగా సర్వే సత్యనారాయణ కోసం బీజేపీ నాయకులు ప్రయత్నాలు జరుపుతున్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో ఆయన బీజేపీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. ఇవ్వాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.