FbTelugu

మోదీ, అమిత్ ను తరిమేస్తారు: చింతా మోహన్

తిరుపతి: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం సరిగ్గా లేదని, ఆయన లోగుట్టు దేశ ప్రజలందరికీ తెలిసేలా త్వరలో బయటపెడతానని తిరుపతి ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ హెచ్చరించారు.
మోదీ, అమిత్ షాలను దేశం నుంచి తరుముకునే రోజులు వస్తాయని, బిజెపి దేశాన్ని, వైసిపి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మోదీ పెద్ద మనిషి కాదు అని, ఆయన నిజాయితీ పరుడు కూడా కాదన్నారు.

రాజకీయాల్లో కొనసాగడానికి జగన్ అర్హుడు కాదన్నారు. సిఎం వైఎస్.జగన్ తీరు సరిగ్గా లేదుని, ఇప్పటికే 99 తప్పులు చేశాడన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వంద తప్పు కూడా చేస్తున్నాడన్నారు. రాజకీయాలంటే దోచుకోవడం, దాచుకోవడం కాదని చింతా మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయాలంటే త్యాగం, సేవ తప్ప, దోచుకోవడం కాదన్నారు. జగన్, చంద్రబాబు లో ఈ మంచి గుణాలు లేవన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన జగన్ వేల కోట్లు సంపాదించాడన్నారు. ఇసుక, ఎర్రచందనం, మద్యం మాఫియా ద్వారా వేలాది కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారన్నారు. మోదీకి భయపడి ప్రత్యేక హోదా గురించి అడగడం లేదని ఆయన జగన్ ను విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ప్రత్యేక హోదా ఎక్కడ పోయిందని చింతా మోహన్ నిలదీశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.