FbTelugu

మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్ కన్నుమూత

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో పలువురు నేతలను బలి తీసుకుంటున్నది. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్.ఎల్.డి) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ (82) కన్నుమూశారు.

కరోనా పాజిటివ్ సోకి ఉపిరితిత్తుల సమస్యతో గుర్గాంవ్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షిణించడంతో గురువారం మృతిచెందినట్లు ఆయన కుమారుడు జయంత్ చౌదరి ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు అయిన చరణ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ లో కీలక నేతగా ఎదిగారు. మాజీ కేంద్రమంత్రి అజిత్ సింగ్ మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పార్లమెంటు సభ్యునిగా, కేంద్రమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. ప్రజల కోసం పరితపించిన నాయకుడని కొనియాడారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు రైతులకు ఎంతగానో ఉపయోగ పడ్డాయన్నారు. అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్, మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని అన్నారు. రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సిఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని సిఎం గుర్తు చేసుకున్నారు. అజిత్ సింగ్ మృతి పట్ల తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.