FbTelugu

టీఎంసీలోకి మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి

కొలకతా: మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, బీజీపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా టీఎంసీ పార్టీలో చేరారు. ఆయన కుమారుడు జయంత్ సిన్హా బిహార్ లోని హజరీబాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
యశ్వంత్ సిన్హా ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి నచ్చక 2018లో బీజేపీ కి రాజీనామా చేశారు. మోదీని లక్ష్యంగా చేసుకుని పలు అంశాలలో విమర్శలు గుప్పించారు కూడా.

ఆ తరువాత ఏ పార్టీలోనూ చేరలేదు. శనివారం కొలకతా పార్టీ కార్యాలయంలో టీఎంసీ నేతలు డెరెక్ ఓబ్రెయిన్, సుదీప్ బంధోపాధ్యాయ, సుభ్రతా ముఖర్జీలు ఆయనకు కండువా కప్పారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని, న్యాయ వ్యవస్థ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ శక్తిని కోల్పోతున్నాయన్నారు. అంతకు ముందు ఆయన సీఎం మమతా బెనర్జీని కలుసుకుని పలు అంశాలపై చర్చించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.