FbTelugu

బీజేపీ కండువా కప్పుకున్న మిథున్

కొలకతా: బాలీవుడ్ హీరో, మాజీ టీఎంసీ నాయకుడు మిథున్ చక్రవర్తి బీజేపీ లో చేరారు. ఇవాళ కొలకతాలో జరిగిన ఒక బహిరంగ సభలో బీజేపీ పశ్చిమ బెంగాల్ ఇన్ ఛార్జి కైలాస్ విజయ వర్గీయ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈరోజు సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సి ఉండగా పార్టీ సీనియర్ నాయకులు కండువా కప్పారు.

ప్రధాని మోదీ స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు మిథున్ టీఎంసీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఆయన తన ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. బీజేపీ ఆహ్వానం మేరకు ఆయన పార్టీలోకి వచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.