FbTelugu

వాటికి అడ్డురాని కరోనా ఎన్నికలకు అడ్డా?: కొల్లు రవీంద్ర

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణకు వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో టీడీపీ నేత, మాజీ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల సభలు, సమావేశాలకు అడ్డురాని కరోనా స్థానిక ఎన్నికలకు అడ్డువస్తోందా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో స్కూళ్లను తెరిచినపుడు అడ్డురాని కరోనా ఎన్నికలకే ఎందుకు అడ్డు వస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.