FbTelugu

ఆ రెంటితోనే వైరస్ విజృంభణ: రఘురామరాజన్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభించడానికి ప్రధానంగా రెండే రెండు కారణాలు ఉన్నాయని ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటి ముందుచూపు లేకపోవడం, రెండో నాయకత్వ లేమి అని అన్నారు.
ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తగా ఉండి ఉంటే, అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని ఆయన బిజెపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

కరోనా వైరస్ భూమ్మీదకు వచ్చిన తరువాత బ్రెజిల్ ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించి ఉంటే వైరస్ మళ్లీ విజృంభిస్తుందనే విషయాన్ని గ్రహించేవారని అన్నారు. రోజు రోజుకు రూపాన్ని మార్పుచుకుంటూ బలోపేతమై వివిధ రూపాల్లో దాడి చేయడానికి రెడీగా ఉందని గుర్తించగలిగి ఉండేవారని రాజన్ వివరించారు. ఫస్ట్ వేవ్ తరువాత వైరస్ పై మనం విజయం సాధించామని పెద్దలు గొప్పలు చెప్పుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
దేశంలో మార్చిలో మొదలైన సెకండ్ వేవ్ ఏప్రిల్ నాటికే పతాక స్థాయికి చేరుకుందని, పాలకులకు నిద్రలేకుండా చేస్తోందన్నారు. సెకండ్ వేవ్ విజృంభణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తను తలపించే విధంగా జరుగుతుండడమే ప్రధాన కారణమని అన్నారు. రాజన్ ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ఫైనాన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.