FbTelugu

కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం ఉదయం ఏయిమ్స్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. 88ఏళ్ల వయసున్న ఆయనకు ఏప్రిల్ 19న కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో ముందు జాగ్రత్తగా చికిత్స కోసం ఏయిమ్స్ ట్రామా సెంటర్‌లో చేరి చికిత్స చేయించుకున్నారు. కాగా మన్మోహన్ రెండు డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నేతలు ఆకాంక్షించారు. అందరి ఆకాంక్షలు, దీవెనల ఫలితంగా ఆయన కోలుకుని ఇవాళ డిశ్చార్జీ అయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.