FbTelugu

మాజీ ప్రధాని కుమార్తె వాణిదేవీ విజయం

హైదరాబాద్: మాజీ ప్రధాని పివి.నరసింహ్మారావు కుమార్తె, టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవీ మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు.

బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు ను ఓడించారు. మరికాసేపట్లో గెలుపుపై రిటర్నింగ్ అధికారి అధికారిక ప్రకటన చేయనున్నారు. 11 వేల 703 ఓట్లు ఆధిక్యంతో వాణి దేవీ గెలుపోందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 పోలవ్వగా రెండో ప్రాధాన్యతగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణీదేవి విజయఢంకా మోగించారు. ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నీతానై కష్టపడి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.