FbTelugu

కుదురుగా మాజీ ప్రధాని: ఏయిమ్స్

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటిన్ ను ఏయిమ్స్ వైద్యులు విడుదల చేశారు.

ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, చికిత్సకు సహకరిస్తున్నారని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మన్మోహన్ కు గుండె నొప్పి రావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచామని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మన్మోహన్ సింగ్ కు ఛాతీలో నొప్పి రావడంతో ఎయిమ్స్ కి తరలించిన విషయం తెలిసిందే. ఎయిమ్స్ లోని ఐసీయూ లో మన్మోహన్ సింగ్ కు చికిత్స కొనసాగుతోంది.

You might also like