FbTelugu

ఏయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ (87)‌ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఛాతీ నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలియచేయడంతో ఆదివారం రాత్రి ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

గుండె వైద్యులు మన్మోహన్ సింగ్ ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. వైద్య పరీక్షల తరువాత నిర్ధారణకు రానున్నారు. 2009 సంవత్సరంలో ఏయిమ్స్ లో హృద్రోగ శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

మార్చిలో పార్లమెంటు సమావేశాలు ముగిసిన సందర్భంగా అస్వస్థతకు గురి కాగా, పూర్తిగా బెడ్ రెస్టు తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. వారం రోజుల క్రితం సోనియా గాంధీ తో మన్మోహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఆకాంక్షించారు.

You might also like