FbTelugu

‘రేవంత్ రెడ్డీ.. తీరు మార్చుకో’: వీహెచ్

హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) మరోమారు విరుచుకు పడ్డారు. రేవంత్ రెడ్డి తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు.

తన రాజకీయ జీవితంలో ఇలాంటి నాయకుడిని చూడలేదని అన్నారు. నేనే సీఎం అని గతంలో ఎన్నడూ చెప్పుకోలేదని అన్నారు. తనలాంటి సీనియర్ నాయకులపై అడ్డగోలు పోస్టింగ్ లు పెడుతున్నారని ఆరోపించారు. అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

You might also like