FbTelugu

మాజీ ఎంపి సబ్బం హరి ఇకలేరు

విశాఖపట్నం: అనకాపల్లి మాజీ ఎంపి సబ్బం హరి (69)కొద్దిసేపటి క్రితమే కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. కరోనా పాజిటివ్ సోకడంతో కొద్ది రోజులుగా అరిలోవ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
గత నెల రెండో వారంలో కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో రెండు మూడు రోజులు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం క్షీణించంతో ఆయనను విశాఖ బీచ్ రోడ్డులోని కనకదుర్గ హాస్పిటల్ లో చేర్పించారు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో పది రోజుల క్రితం అరిలోవలోని అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. అప్పటి నుంచి సబ్బం హరికి వెంటిలేటర్ ఏర్పాటు చేశారు. ఆందోళనకరంగా ఉండడంతో వారం రోజుల క్రితం ప్రత్యేక ఏయిర్ అంబూలెన్స్ లో హైదరాబాద్ కు తరలించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. ఏమైందో ఏమో కాని కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సబ్బం హరి అరిలోవ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం విషమంగా మారిందని కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యానికి శరీరం సహకరించడం లేదని వైద్యులు కూడా చెబుతున్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన హాస్పిటల్ లో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. టీడీపీ నేత, మాజీ ఎంపి సబ్బంహరి మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టిడిపి అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సబ్బంహరి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నాను అని అన్నారు. ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటారని ఆశించాను. కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని అన్నారు. సబ్బం హరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.