FbTelugu

కెసిఆర్ కు దమ్ముంటే ఈటలను బహిష్కరించాలి

హైదరాబాద్: రాజకీయ కక్షతో ఈటల రాజేందర్ మీద సిఎం కెసిఆర్ చర్యలు తీసుకున్నారు. కెసిఆర్ కు దమ్ముంటే ఈటల ను ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించలేదని ప్రశ్నించారు.
ఈటల రాజేందర్ ను ఆయన నివాసంలో ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిశారు. సమావేశం తరువాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆయనకు నైతిక మద్ధతు ఇవ్వడానికి వచ్చామన్నారు. రాజకీయాలు చర్చించలేదని, అయినా రాజకీయాలు మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదన్నారు. కరోనా నివారణకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కరోనా తో పోరాడ్డం అందరూ చేయాల్సిన పని అన్నిరు. కెసిఆర్ ఇలాంటి చౌకబారు, చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడేందుకు ఐక్య వేదిక కోసం ప్రయత్నం చేస్తున్నామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
విచిత్రమైన రాజకీయ పరిస్థితి తెలంగాణ లో ఉందని, రాజకీయ విభేదాలు ఉంటే చర్చించాలి తప్ప కక్ష సాధించడం ఎంటి? అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. ఎం.కోదండరామ్ విమర్శించారు. కెసిఆర్ దగ్గర పని చేసే వారు ఎవరైనా తన నీడలో బ్రతకాలి అనుకుంటాడు. వ్యక్తిగతంగా ఎదిగితే ఏమాత్రం సహించే గుణం కాదన్నారు. అలాంటి నాయకులపై విపరీతమైన విద్వేషం చూపిస్తాడన్నారు. రాజకీయంగా, ఆర్థికపరంగా ఒత్తిడి తీసుకువచ్చి ఇబ్బందులు పెడతారన్నారు. కరోనా రోగులు వైద్యం, మందులు దొరకక ఇబ్బంది పడుతుంటే పరిష్కరించకుండా, ఈటలపై కక్ష సాధింపు రాజకీయాలు చేయడం ఏంటని అన్నారు. రాజకీయాలు వేరు కుటుంబం వేరన్నారు. ఇలా ఈటల కుటుంబ సభ్యులను కూడా ఇరికించి బాధ పెడుతున్నారని ఆరోపించారు. ఈటల మీద దాడిని ఆత్మ గౌరవం మీద దాడి గానే చూస్తున్నాం. ఇప్పటికైనా కేసిఆర్ కక్ష సాధింపు దాడులు ఆపాలి అని డిమాండ్ చేశారు. రాజకీయం అంటే పార్టీ కాదు సమస్యల మీద కూడా చర్చించడం కోదండరామ్ అన్నారు.

తెలంగాణ లో అందరం కలిసి కెసిఆర్ పై పొట్లడతామని, అందరం కలిసి పని చేస్తామని అన్నారు. భవిష్యత్తులో అది ఏ రూపు తీసుకుంటుందో కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు నోటీసులు ఇస్తే సిఎం కెసిఆర్ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జూడాల సమస్య పరిష్కారం చెయ్యరు కాని కుట్ర రాజకీయాలు చేస్తారన్నారు. కరోనా వైద్యం, మందుల కొరతపై ప్రతి పక్షాలు అన్నీ కలిసి పని చేయాలని కోదండరామ్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.