FbTelugu

రేవంత్ కు పిసిసి పీఠం ఇస్తే ఏమౌతుంది: మాజీ ఎంపి కొండా

హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపి ఏ.రేవంత్ రెడ్డికి పిసిసి పగ్గాలు ఇచ్చినా, పార్టీ బలపడదని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాలేరని మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు.

ఆయనకు పగ్గాలు ఇచ్చినా తిరిగి కాంగ్రెస్ లో చేరేది లేదని ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, అంతో ఇంతో తెలంగాణలో మాత్రమే ఉందని కొండి విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పంజాబ్, అస్సాం, హర్యానాలో కాంగ్రెస్ ప్రభావం ఉందని, మిగితా రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిందని ఆయన పేర్కొన్నారు. అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము తెలంగాణ కోసం పోరాటం చేస్తామని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడతామని అన్నారు. సిఎం కెసిఆర్ మంచిదారిలో నడిస్తే ఆయనకు తన మద్ధతు ఉంటుందని, కాని ఆయన మంచివాళ్లను దూరం చేసుకుని చెడ్డవాళ్లను దగ్గరకు తీసుకుంటున్నారని విశ్వశ్వర్ రెడ్డి ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.