FbTelugu

విగ్రహాల విధ్వంసం వైసీపీ, బీజేపీ కుట్ర: మాజీ ఎంపీ హర్ష

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం బీజేపీ, వైసీపీ ల కుట్ర అని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు క్రైస్తవ మతంపై అనవసర వ్యాఖ్యలు చేశారని మాజీ ఎంపీ జివి.హర్షకుమార్ అన్నారు.
విగ్రహాల ధ్వంసం కారణంగా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, వైసీపీలకే ఓటు బ్యాంకు స్థిరపడుతుందని, టీడీపీకి నష్టం జరుగుతుందని ఆయన వివరించారు.

ఈ రెండు పార్టీల కుట్రలో భాగంగానే విగ్రహాల ధ్వంసం కొనసాగుతోందని హర్షకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంస కుట్రను బీజేపీ విజయవంతంగా నడిపిస్తోందని, అందుకు వైసీపీ సహకరిస్తోందన్నారు. తెలంగాణ మాదిరి హిందూ ఓటు బ్యాంకు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. కేంద్రంలోని పెద్దల ఆదేశాల ప్రకారమే విగ్రహాల ధ్వంస దోషులను పట్టుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

విగ్రహాల ధ్వంసం కేసులపై సుప్రీంకోర్టు జడ్జీ ఆధ్వర్యంలో విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయన్నారు. మత విశ్వాసాలు రెచ్చగొట్టే బీజేపీ కి వైసీపీ లోపాయకారిగా సహకరిస్తోందన్నారు. హైదరాబాద్ ఛార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ గుడి వద్ద సెంటిమెంట్ ను రెచ్చగొట్టి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ భారీగా లాభపడిందన్నారు. తెలంగాణతో పాటు దేశంల ఎంఐఎం పార్టీతో బీజేపీకి లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. విగ్రహాల విధ్వంసం కారణంగా ఏపీలో దళితులు, మైనార్టీల ఓటు బ్యాంకు మళ్లీ వైసీపీకి దగ్గరయ్యారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.