FbTelugu

సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే

కడప: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి.శివరామ కృష్ణారావు రాజమండ్రిలో సన్యాసం స్వీకరించారు. బ్రాహ్మణ కులానికి చెందిన శివరామకృష్ణా రావు బద్వేల్ నుంచి కాంగ్రెస్ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

ఆయన సన్యాసం స్వీకరించడం కడప జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈయన మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డితో పలుమార్లు ఎన్నికలలో తలపడి చివరకు ఓ సారి విజయం సాధించారు. రాజకీయాల నుండి వైదొలిగి సన్యాసం తీసుకున్న తర్వాత శివరామకృష్ణారావు శివరామానంద సరస్వతిగా మారారు. 1978 లో ఒకసారి, 1989 లో రెండోసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.