FbTelugu

మాజీ ఎమ్మెల్సీ సునీతకు వైసీపీ బీఫామ్

* నేడు జగన్ ను కలిసిన సునీత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని తన నివాసంలో ఇవాళ మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత సాదరంగా కలిశారు.
ఇటీవలే నోటిఫికేషన్‌ జారీ అయిన ఎమ్మెల్సీ స్ధానానికి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా పోతుల సునీతను ఎంపిక చేశారు.

ఇవాళ సీఎం జగన్‌ చేతుల మీదుగా బీఫామ్‌ను పోతుల సునీతకు అందజేశారు. తనని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి సునీత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, పోతుల సురేష్‌ హాజరైనారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.