FbTelugu

మాజీ ఎమ్మెల్యే కూన బీజేపీలో చేరిక

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ బీజేపీ లో చేరనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన బీజేపీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కూన శ్రీశైలం గౌడ్ నియమితులయ్యారు. 2009లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి రెబెల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2008లో కూడా ఓడిపోయిన ఆయన తాజాగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ టికెట్ ను ఆశించారు. మాజీ మంత్రి జి.చిన్నారెడ్డికి కేటాయించడంతో ఇక భవిష్యత్తు లేదని గ్రహించిన కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ లోకి వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేదని నిర్ణయించారు. ఇవాళ మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.