FbTelugu

భూ దందాల్లో సీఎం కేసీఆర్ కుటుంబ హస్తం: బీజేపీ

హైదరాబాద్: నగరంతో పాటు చుట్టుపక్కల జరిగే భూ దందాల్లో సీఎం కేసీఆర్ కుటుంబ హస్తముందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ ఆరోపించారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే భూ దందాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నకిలీ పత్రాలతో కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. బోయిన్ పల్లి మనో వికాస్ నగర్ లో కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేశారని ప్రచారం చేసుకుంటున్నారని, ఎందుకు కిడ్నాప్ కు గురయ్యారనేది మాత్రం పోలీసులు వివరించడం లేదన్నారు.

హఫీజ్ పేట భూములు ఎవరివి, ఎవరి కబ్జాలో ఉన్నాయి, ప్రవీణ్ రావు కు సంబంధమేంటనే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. మియాపూర్, హఫీజ్ పేట భూ కబ్జాల వెనకాల మజ్లిస్, టీఆర్ఎస్ పెద్ద నేతల హస్తముందన్నారు. కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావు, మాజీ మంత్రి అఖిల ప్రియారెడ్డి తో పాటు టీఆర్ఎస్ నేతల ప్రమేయాన్ని నిగ్గు తేల్చాలన్నారు. రాష్ట్రంలో ఇసుక, డ్రగ్, భూముల మాఫియాకు సీఎం కేసీఆర్ పేషీ కేంద్రంగా మారిందని, వందలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ప్రభాకర్ సంచలన ఆరోపణ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.