FbTelugu

బందరు సబ్ జైలుకు మాజీ మంత్రి కొల్లు

14 రోజుల రిమాండ్‌ విధించిన మెజిస్ట్రేట్
విజయవాడ: వైసీపీ నేత, రౌడీ షీటర్ మోకా భాస్కర్ రావు హత్యకేసులో అరెస్టయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఇవాళ మెజిస్ట్రేట్‌ ముందుహాజరు పరిచారు.
రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు విన్నారు. ఇరు వర్గాల తరఫు వాదనల తరువాత కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను బందరు సబ్ జైలుకు తరలించారు.

కొల్లు రవీంద్రను పోలీసులు శుక్రవారం రాత్రి తూర్పు గోదావారి జిల్లాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్తుండగా మార్గమధ్యంలో తుని మండలం సీతారాంపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి మచిలీటపట్నం ఎస్పీ ఆఫీసుకు తీసుకువచ్చారు. జూన్‌ 29న హత్యానంతరం మోకా బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో మాజీ మంత్రి కొల్లు పేరు ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.