FbTelugu

విజయసాయికి మతిభ్రమించింది : వడ్డే శోభనాద్రీశ్వరరావు

విజయవాడ: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పి. అశోక్ గజపతి రాజు పై తీవ్ర విమర్శలు చేసిన వైసిపి రాజ్యసభ వి.విజయసాయి రెడ్డి పై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు.
విజయసాయికి మతిభ్రమించిందని, అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పాతకేసుల్లో ఏ రోజైనా అశోక్ గజపతి జైలుకు వెళ్ళక తప్పదన్న విజయసాయి రెడ్డి ప్రకటన చూస్తే అతని మానసిక స్థితి సరిగ్గా లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

అనేక అవినీతి కేసుల్లో విజయసాయి హైదరాబాద్ చంచల్ గూడ జైలులో పదిహేను మాసాలు గడిపి వచ్చారని, మళ్లీ చిప్పకూడు తప్పదనే భయంతో ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనుపిస్తుందన్న నానుడి విజయసాయి కి పక్కాగా వర్తిస్తుందన్నారు. విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీకి 600 ఎకరాలు దానం చేయటమేకాక, వేలకు వేల ఎకరాలు భూములను పలు దేవాలయాలకు, ధార్మిక సంస్థలకు దానం చేసిన ఘన చరిత్ర అశోక్ గజపతి రాజు కుటుంబానికి ఉందన్నారు. ఇలాంటి కుటుంబంపై నిందలు వేసే ముందు నోరు జాగ్రత్త పెట్టుకోవాలని వడ్డే శోభనాద్రిశ్వర రావు విజయసాయిని హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.