FbTelugu

కరోనా ఆయుర్వేద మందుపై సర్కార్ కక్ష

నెల్లూరు: కృష్ణపట్నంలో బొనిగి ఆనందయ్య కరోనా రోగులకు ఇష్తున్న ఆయుర్వేద మందుపై ఏపి సర్కార్ ఎందుకు కక్ష కట్టిందో అర్థం కావడం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
నయాపైస తీసుకోకుండా ఉచితంగా మందు పంపిణీ చేస్తుంటే శాస్త్రీయత లేదని మూసేయించడం అన్యాయమన్నారు. కరోనా వచ్చిన వారు ఆనందయ్య ఇచ్చిన ఆయుర్వే మందు తీసుకుంటే నయం అవుతున్నదని, రిపోర్టులో కూడా నెగెటివ్ వస్తున్నదన్నారు. వెంటిలేటర్ పై ఉన్నవారు కూడా మందు తీసుకుని, రెండు రోజుల తరువాత నడుచుకుంటూ వెళ్తున్నారని ఆయన వివరించారు. రాకుండా ఉండేందుకు కూడా మందు ఇస్తున్నారని సోమిరెడ్డి వివరించారు. కృష్ణపట్నంలో ఆయన ఇచ్చిన ఆయుర్వేద మందుతో వేలాది మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారన్నారు. మెడికల్ రిపోర్టులో శాస్త్రీయంగా నిరూపితం అయిన తరువాత కూడా జిల్లా కలెక్టర్ ఆయుర్వేద మందు పంపిణీ ని నిషేధించడం ఘోరమన్నారు. ఇలాంటి ఉపయోగకరమైన మందును జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదో అర్థం కావడం లేదని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

అల్లోపతిక్ వైద్యంతో నయం కాని వారు కూడా ఇక్కడకు వచ్చి బాగు చేసుకుని వెళ్తున్నారని అన్నారు. బొనిగి ఆనందయ్య కుటుంబం దశాబ్ధాల కాలం నుంచి ఆయుర్వేద మందులను ఇస్తున్నారని, సమాజానికి మంచి చేస్తున్నారే తప్ప కీడు చేయడం లేదన్నారు. కరోనా పై అల్లోపతిక్ ఇప్పటి వరకు సరైన మందు లేదని, వ్యాక్సిన్ డోసుల మధ్య ఇష్టమున్నట్లుగా సమయం పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి విపత్కర సమయంలో సంజీవని మాదిరిగా ఆనందయ్య ఉచితంగా మందు పంపిణీ చేస్తుంటే ప్రభుత్వం ఆపేయడం ఏమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల క్షేమాన్ని కోరేవారు అయితే వెంటనే ఆయన తయారు చేస్తున్న మందును పంపిణీ చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.