FbTelugu

కాపు ఉద్యమానికి గుడ్ బై: ముద్రగడ

చంద్రబాబు లక్ష్యంగా ఉద్యమం చేశాను

ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

తూ.గో. జిల్లా: కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి, కాపు కుల సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.
కాపు కుల సోదరులకు మాజీ మంత్రి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఇటీవల కొంతమంది సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో నాపై విమర్శల దాడులు చేస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. నన్ను కులద్రోహి, గజదొంగ వంటి మాటలతో విమర్శిస్తున్నారని ఆరోపించారు. నేను ఉద్యమంలో వసూలు చేసిన నిధులు వారికి పంచలేదనా ఆ దాడులు అని ముద్రగడ ప్రశ్నించారు.
నేను ఉద్యమంలోకి రావడానికి ప్రధాన కారణం ఎన్.చంద్రబాబు నాయుడు అని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమం ద్వారా ఆర్ధికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయానని ముద్రగడ ఆందోళన వ్యక్తం చేశారు. కాపు కులం వాళ్లను బీసీలలో చేర్చాలంటూ గతంలో ఒంటి కాలి పై లేచేవాడు, ఇప్పుడు రెండు కాళ్ళు చల్లబడిపోయాయా అంటూ నాపై కామెంట్ పెట్టడం బాధ అనిపిస్తుందన్నారు

బీసీల్లో చేర్చేందుకు టీడీపీ హయాంలో కాపు మేధావులతో కలిసి ఉద్యమం నడిపానన్నారు. బంతిని కేంద్రం కొర్టులో వేసాను అనడం బాధిస్తుందన్నారు. ఉద్యమం సందర్భాలను బట్టి రూపురేఖలు మార్చుకొంటుందని ముద్రగడ ఆ లేఖలో స్పష్టం చేశారు. కాపు కులానికి ఏదో విధంగా మేలు జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని ఆయన అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.