FbTelugu

మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో మృతి

విజయవాడ: మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందారు. మాణిక్యాలరావుకు కరోనా సోకడంతో ఆయన గత నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇవాళ ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడడంతో అత్యవసర వైద్యం అందించారు.

అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మాణిక్యాలరావు తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తొలి ప్రయత్నంలోనే చంద్రబాబు కేబినెట్‍లో మాణిక్యాలరావుకు మంత్రి పదవి వరించింది. టీడీపీ హయాంలో 2014 నుంచి 2018 వరకు దేవాదాయశాఖ మంత్రిగా పని చేశారు.

You might also like