FbTelugu

మాజీ మంత్రి వాడుకుని వదిలేశాడు….

చెన్నై: తమిళనాడు కు ఏఐఏడిఎంకె నాయకుడు, మాజీ మంత్రి మణికందన్ పై కోలీవుడ్ నటీమణి చాందిని సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు వాడుకుని వదిలేశాడని పోలీసులను ఆశ్రయించింది.

ఆ మాజీ మంత్రి తో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, ఇద్దరం కలిసి సన్నిహితంగా మెలిగామని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని ఆమె వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడని, ఎప్పుడు చేసుకుంటావని అడిగితే బెదిరిస్తున్నాడని చాందిని ఆరోపించింది. మణికందన్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను పోలీసులకు అందచేసింది. తనకు న్యాయం జరిగే వరకు వదిలేదని లేదని, పెళ్లి చేసుకుని తీరుతానని ఆమె స్పష్టం చేసింది. చాందిని ఎవరో తనకు తెలియదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని మాజీ మంత్రి మణికందన్ హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.