FbTelugu

బీజేపీ విష్ణు సీఎం జగన్ ఏజెంట్: మాజీ మంత్రి కొత్తపల్లి

అమరావతి: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్థన్ రెడ్డి హైందవ ముసుగులో సీఎం వైఎస్. జగన్ రెడ్డి భజన చేస్తున్నారని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ మండిపడ్డారు. ఖబడ్దార్..నీ మాటలు ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
ఇష్టానుసారంగా మట్లాడితే ప్రజలు శిక్ష వేస్తారని, ఏ ప్రయోజనం ద్వారా చంద్రబాబును విమర్శిస్తున్నారని విష్ణును జవహర్ ప్రశ్నించారు. జగన్, విష్ణు రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి కులం నాయకులని, అందుకే వెనకేసుకొస్తున్నారని అన్నారు. హైందవ రక్షకుడిగా జగన్ రెడ్డి.. ఆలయాలు కూల్చేవాడిలా చంద్రబాబు నాయుడు మీకు కనబడుతున్నారా? అని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు ఆలయాలు కూర్చుతున్నారని విష్ణువర్థన్ రెడ్డి అంటున్నారని, అప్పుడు ఆయన ఏ కలుగులో ఉన్నారని జవహర్ విమర్శించారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు విష్ణువర్థన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీలో ఉంటూ సమయం చిక్కినప్పుడల్లా జగన్ భజన చేస్తున్నాడని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆలయాలను కాపాడింది టీడీపీనే అని, అన్ని మతాలను గౌరవించేది ఒక్క టీడీపీనే అన్న మాట గుర్తుంచుకుంటే మంచిదని కొత్తపల్లి జవహర్ ఆయనకు హితవు పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.