FbTelugu

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

కృష్ణా: తీవ్ర ఉద్రిక్తత నడుమ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నoదుకు నాపై అక్రమ కేసులు పెడుతున్నారు. నిన్న నా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లిన నాపై వైసీపీ వారే దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదని హౌస్ అరెస్ట్ అని చెపితే నేను ఇంట్లోనే ఉన్నాను. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నన్ను పోలీసులు మీడియాతో మాట్లాడనివ్వకుండా ఇబ్బందులు పెట్టారు. సంబంధం లేని వాటిల్లో నన్ను ఇరికించి కావాలని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు, ప్రజాస్వామ్యం ఏమౌతుందో అర్ధం కావడం లేదని రవీంద్ర అన్నారు.

శివరాత్రి రోజున నది స్నానానికి వెళ్లి పితృదేవతలకు పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార శాఖ మంత్రి పేర్ని నన్ను ఇబ్బంది పెట్టాలని నాపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. పోలీసులు అడిగితే నేనే వచ్చి సమాధానం చెప్పే వాడినన్నారు. తెల్లవారుజాము నుంచి పోలీసులు ఇంటిని చుట్టూ ముట్టి ఎవ్వరిని రానివ్వకుండా చేశారు. అరెస్టులు శాశ్వతం కాదు… పోలీసులతో పాలన చేయాలి అనుకుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. కేసులు పెట్టి తాత్కాలికంగా ఇబ్బందులు పెడుతున్నారు… రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి రవీంద్ర అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.