FbTelugu

మాజీమంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిగి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇవాళ సాయంత్రం మహబూబ్‌నగర్‌లో మహమ్మదాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

1967లో జరిగిన ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం 1972, 1989లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1980లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1968లో చీఫ్‌విప్‌గా, 1977లో వెంగల్ రావు మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ, 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్‌లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు.

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన అయన 2014 ఎన్నికల్లో టికెట్‌ లభించకపోవడంతో బీజేపీలో చేరారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.