FbTelugu

ప్రగతి భవన్ కాదు బానిస బంగ్లా: ఈటల

హైదరాబాద్: సిఎం కెసిఆర్ అధికారిక బంగ్లా ‘‘ప్రగతి భవన్’’ కాదు.. అది ‘‘బానిస భవన్’’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. సొంత కుటుంబం కోసం మాలాంటి వాళ్ళను అణచివేస్తున్నారని ఆరోపించారు.

తన మాట వినని అందర్నీ తొక్కేశారని, ఏ దిక్కు లేని సమయంలో కెసిఆర్ కు అండగా నిలబడ్డామన్నారు. కెసిఆర్ తో గత ఐదేళ్లనుండి సఖ్యత లేదని, అయినా ప్రజల కోసం భరిస్తూ వచ్చానన్నారు. నాలాగే మంత్రి హరీష్ రావు కూడా ఎన్నోసార్లు ప్రగతి భవన్ లో అవమానించబడ్డారు, అయినా దిగమింగుతూ  వస్తున్నారన్నారు. కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బి ఫారం ఇచ్చినా నిజామాబాద్ ఎంపి ఎన్నికల్లో ఓడిపోయింది కాని నేను ఎప్పుడు ఓడిపోలేదన్నారు. బెంజ్ కార్లలో తిరిగేటోళ్లకు రైతుబంధు ఇస్తున్నారని, పేద రైతుల నోళ్లు కొడుతున్నారన్నారు. ఐకెపి సెంటర్ల ఎత్తివేత విషయంలో కెసిఆర్ తో బాజాప్త విభేదించానని, రైతుల కోసమేనని ఆయన అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.