FbTelugu

గంగుల రాళ్ళు కొట్టుకొని బతకాలి: ఈటల

హుజూరాబాద్: బిడ్డా గుర్తు పెట్టుకో ఎవడు వెయ్యేళ్ళు బ్రతకరు అని మంత్రి గంగుల కమలాకర్ పై మాజి మంత్రి ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు.
ఇవ్వాళ ఈటల రాజేందర్ మీడియా తో మాట్లాడుతూ
అధికారం శాశ్వతం కాదన్నారు. హుజురాబాద్ ప్రజలను వేదిస్తున్నవు. బిల్లులు రావు అని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. కరీంనగర్ ను బొందల గడ్డ చేస్తున్నావు అని విమర్శించారు. నువు ఎన్ని టాక్స్ లు ఎగగొట్టినవో తెలవదు అనుకుంటున్నావా. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి.

నీ కథ ఎందో అంతా తెలుసు అని హెచ్చరించారు. 2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదని స్పష్టం చేశారు. నువు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది. అదే గతి నీకు పడుతుంది.
2006 లో కరీంనగర్ లో ఎంపి గా పోటీ చేసినప్పుడు వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత మందిని కొన్నా.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్ లో కూడా అదే జరుగుతుందన్నారు. ప్రజలు అమాయకులు కారు అని హితవు పలికారు. ఇప్పటి వరకు నేను సంస్కారం తో మర్యాద పాటిస్తున్నాను. సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారని ఈటల అన్నారు.
హుజురాబాద్ లో మా మిత్రుడికి ఇంఛార్జి ఇచ్చినట్టు తెలిసింది. కానీ మొన్న ఎంపి ఎన్నికలలోనూ మిగతా అన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వేస్తే.. 54 వేల మెజారిటీ ఇచ్చి ఆదుకున్న నియోజక వర్గం హుజురాబాద్ అన్నారు. ఈ ప్రజల మీద ఈగ వాలకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.