FbTelugu

టిఆర్ఎస్ వేధిస్తే ఘోరీ కడతా: ఈటల హెచ్చరిక

హుజూరాబాద్: రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తునే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేందుకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

బిజెపిలో చేరిన తరువాత తొలిసారి ఈటల ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గం నాగారం లో పూజలు చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనతో పాటు తన అనుచరులను రాజకీయంగా, ఆర్థికంగా వేధింపులకు పాల్పడితే టిఆర్ఎస్ పార్టీకి ఘోరీ కడతానని హెచ్చరించారు. నియోజకవర్గం ప్రజలు ప్రేమ, అభిమనాలకు లొంగుతారు తప్ప డబ్బు సంచులకు లొంగరనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. చిలుక పలుకులు పలుకున్న మంత్రులకు ఆత్మగౌరవం ఉందా అని ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. మీరు మీ ఇళ్లలో ప్రశాంతంగా నిద్ర పోతున్నారా, మీ భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో ఉన్నారా అని నిలదీశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు హుజూరాబాద్ ఉప ఎన్నికలు సెమీ ఫైనల్ అని అన్నారు. రేపటి (శుక్రవారం) నుంచి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తానని, కెసిఆర్ అహంకార పూరిత రాజకీయాన్ని ఎండగడతాని ఈటల రాజేందర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.