FbTelugu

కెసిర్ మోసగాడు, కుట్రదారుడు: ఈటల

హన్మకొండ: కెసిఆర్ కు దళితుల మీద ప్రేమ ఉంటే వారి జనాభా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలకు కెసిఆర్ మీద విశ్వసనీయత లేదన్నారు.
కెసిఆర్ కుట్ర దారుడు, మోసకాడు. కుట్రలు, కుతంత్రాలు తప్ప ప్రజలమీద ప్రేమ లేదన్నారు. ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టం అని ప్రజలు అంటున్నారు. ఇవాళ జమ్మికుంట లో బిజెపి నూతన కార్యాలయం లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా కొన్ని వర్గలమీద ఎనలేని ప్రేమ ముఖ్యమంత్రి కి పుట్టుకొస్తుందన్నారు. వైద్యానికి బడ్జెట్ పెంచమని నేను మంత్రిగా ఉన్నప్పుడు అడిగినా పెంచలేదు. కానీ నాకు క్రైడిబిలిటీ ఎక్కడ వస్తుందో అని నేను బయటికి వచ్చిన తరువాత ఇప్పుడు ప్రకటిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వారి వైఫల్యాన్ని ఎత్తి చూపింది. ఈ ఎన్నిక ఫాం హౌస్ నుండి కెసిఆర్ ను బయటకు పరుగులు తీయించింది. ప్రజల బాగోగులు పట్టించుకోకపోతే పుట్టగతులు ఉండవని భయాన్ని లేపింది. తెలంగాణ రాష్ట్రం 85 % బడుగు బలహీనర్గాలకు చెందిన వారే. ఏడు సంవత్సరాలు మర్చిపోయారు. దళిత సీఎం దేవుడెరుగు. ఉపముఖ్యమంత్రి నీ కూడా తీసివేసి దళితులను అవమానపరిచాడు. 16 శాతం ఉన్నవారికి ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి 0.2 శాతం ఉన్నవారికి ఎన్ని పదవులు ఉన్నాయి. మాదిగ కు ఒక మంత్రి, మాలకు ఒక మంత్రి అర్హులు కాదా? సీఎం కార్యాలయంలో ఎంత మంది బడుగు బలహీన వర్గాల వారు ఐఏఎస్ లు ఉన్నారో ప్రకటించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఈ జాతులు పనికి రావా? ఈ జాతులకు ఆ నైపుణ్యం లేదు అని అవమానించిన వ్యక్తి కెసిఆర్. ఉద్యోగులు అందరూ సంఘాలు పెట్టుకుంటే అణచి వేసిన వ్యక్తి. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా ఎంతో గొప్పగా పని చేసిన ఆకునూరి మురళి నీ అక్కడినుండి తీసివేసి ఎక్కడో వేస్తే ఆయన పదవిని వదిలిపెట్టి పోయారు. ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన కె.ప్రదీప్ చంద్ర కు ఎందుకు కొనసాగనివ్వలేదు. ఆయనకు ఇచ్చిన గౌరవం అది. కనీసం పదవీవిరమణ రోజు కూడా కెసిఆర్ వెళ్ళలేదు. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల డబ్బును టాంక్ బండ్ మీద విగ్రహాలు ఖర్చు చేస్తారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీదనా అని అడిగిన నీవు, నీ హయాంలో కూడా అదే జరుగుతుంది. ఈ ఏడు సంవత్సరాల కాలంలో దళిత వర్గాల కోసం రూ.1వెయ్యి కోట్లు అయినా ఖర్చు పెట్టరా? అవన్నీ అడగకుండా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆ జాతి నుండి ఎన్నికయ్యి మొరుగుతున్న బానిస జాతి ద్రోహం చెయ్యకు. ధరణి పేరుతో మొన్న తీసుకు వచ్చిన చట్టం.. ఎన్నో ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిని మళ్లీ దొరలకు అప్పజెప్పిన వ్యక్తి కెసిఆర్. ఈ జాతి అభివృద్ధికి ఏడు సంవత్సరాలుగా ఎం చేశారు? అని రాజేందర్ నిలదీశారు.

మూడు ఎకరాల భూమి స్కీమ్ కోసమే తప్ప పేదల జీవితాలు బాగు పడలేదు. నిజంగా బడుగులు సంతోష పడలేదు. డబుల్ బెడ్ రూం లు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో అదికూడా సాగునీటి ప్రాజెక్టుల లో లబ్ధి పొందిన వారికి మాత్రమే కట్టి ఇచ్చారు, తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో కట్టలేక పోతున్నారు. నీ జాగీరు కాదు ఏదో ఇస్తా ఇవ్వమని చెప్పడానికన్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర రావు చట్టానికి లోబడి పని చేస్తున్నవా? చుట్టానికి లోబడి పని చేస్తున్నవా? ఇంటిలిజెన్స్ పోలీసులా? టిఆర్ఎస్ కార్యకర్తలా ? పార్టీ కండువా కప్పుకొని పని చేసుకో.. కానీ ప్రజల డబ్బులు జీతంగా తీసుకొని ఇలా చేస్తే చూస్తూ ఊరుకోము. మిమ్మల్ని చూస్తుంటే ఇజ్జత్ పోతుంది.. ప్రజలు ఈసడిచుకుంటున్నారని రాజేందర్ మండిపడ్డారు.

కెసిఆర్ కి కుట్రలు, కుతంత్రాలు తప్ప ప్రజల మీద ప్రేమ లేదు. మంత్రిగా కాదు మనిషిగా చూడమని కోరినం. ఈ రోజు ఏ మంత్రి అయితే నా మీద కుట్రలు చేస్తున్నాడో ఆ మంత్రి భార్య ఒక నాడు సిఎం కెసిఆర్ ఫోటోను బయటికి విసిరేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నన్ను తిడుతున్న మంత్రి ఒక నాడు నన్ను భుజాల మీద ఎత్తుకొని తిరిగాడు. కరీంనగర్, హుజూరాబాద్ లో అభివృద్ధికి నిధులు ఇచ్చింది నేను అన్నారు. రాష్ట్రం లో పాలన సవ్యంగా జరగడం లేదు. అందుకే సోషల్ మీడియాలో ప్రజలు ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టం అంటున్నారు. ఈ ప్రభుత్వం మీద అణగారిన వర్గాలకు విశ్వసనీయత లేదు. దళితులకు న్యాయం జరగకుండా దేశం బాగుపడదు అని ఈటల రాజేందర్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.