FbTelugu

క్వారంటైన్ కేంద్రాల్లో నాసిరకం ఆహారం

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు లక్ష దాటుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రశ్నించారు.

కరోనా సోకి క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నవారికి నాసిరకం ఆహారం అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు జీజీహెచ్‌లో 30కిపైగా మృతదేహాలు అనాథల మాదిరి పడి ఉండటం దారుణమన్నారు. జే-ట్యాక్స్‌ వసూళ్ల కోసం రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో విక్రయాలను రాత్రి 9వరకు అనుమతులివ్వడం దారుణమన్నారు. సర్కార్ విధానాలను ప్రశ్నించిన వారిని వేధించడమే ప్రధానంగా పెట్టుకున్నారని దేవినేని ఆరోపించారు.

You might also like